హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు డిసౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ రూట్ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
రాజధాని ఏసీ, సూపర్‌లగ్జరీ బస్సుల్లో ప్రయాణంపై డిసౌంట్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు. అడ్వాన్స్డ్ టికెట్ రిజర్వేషన్ కోసం tgsrtc. telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
వరద బాధితులకు కొందరు దాతలు సీఎం సహాయ నిధికి తోచిన సహాయాన్ని పంపించారు. అయితే వారిని అభినందిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన సర్టిఫికెట్‌ను చూసి దాతలు అవాక్కయ్యారు. ‘వరద’ బాధితులకు సహాయం చేస్తే.. ‘కొవిడ్-19’పై పోరాటానికి సాయం అందించినట్టు ప్రభుత్వం నుంచి అభినందన పత్రం అందింది. ఈ సర్టిఫికెట్లను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ పోస్టులు వైరల్ అయ్యాయి.
– హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ)