హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీని మళ్లీ ప్రారంభించాలని డిమాండ్‌తో గొల్ల కురుమలు పోరుబాట పట్టారు.
ఈ మేరకు ఇందిరాపార్కులో నేడు ధర్నా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ హామీ మేరకు రూ. 2లక్షలు బదిలీ, గొర్రెలు పంపిణీ చేయాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ డిమాండ్ చేశారు.