భద్రాచలం : ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam)వద్ద గోదావరి(Godavari) నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 39 అడుగులకు నీటిమట్టం చేరింది. అర్ధరాత్రి వరకు 43 అడుగుల మేర నీటిమట్టం చేరుకుంటుందని అధికారులు చెబుతుండగా.. అదే జరిగితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. వరద ఉధృతి పెరుతుండడంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశారు.
లోతట్టు ప్రాంత ప్రజలకు సూచనలు చేయడంతోపాటు కంట్రోల్ రూం సైతం ఏర్పాటు చేశారు. కాగా, భారీ వర్షాల(Heavy rains) నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.