Bhadrachalam | భద్రాచలం : ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 42.2 అడుగుల వద్ద వరద ప్రవహిస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. శుక్రవారం రాత్రికి మరింతగా వరద తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే తాలిపేరుకు ఎగువ నుంచి వరద వస్తుండడంతో అధికారులు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 17,704 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 74 మీటర్లు కాగా.. ప్రస్తుతం 69.90 మీటర్ల మేర నీరు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Srisailam Project | కృష్ణమ్మకు పోటెత్తిన వరద.. శ్రీశైలం 6 గేట్లు ఎత్తివేత..
TG Rains | తెలంగాణలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు..!
TG DSC | తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల