హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మతతత్వ బీజేపీ పార్టీ విస్తరణను ఎక్కడికక్కడ అడ్డుకోవడమే సీపీఎం లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లో విలేకరులతో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో అవగాహన పోటీ ఉంటుందని, సీపీఎం బలంగా ఉన్న స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు.
ఎలక్షన్ కమిషన్కు డ్రింకర్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. మద్యం మత్తులో ఓటు వేసేందుకు వచ్చే వారిని నిరోధించేందుకు పోలింగ్ కేంద్రం వద్ద ‘బ్రీత్ అనలైజర్’ పరీక్షలు నిర్వహించాలని రెవెన్యూ కింగ్స్ ఆఫ్ డ్రింకర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తిచేసింది. అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఎన్నికల కమిషన్కు వినతిపత్రం అందజేశారు.