BC Reservations | హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ జీవోను విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నంబర్ 9ని ప్రభుత్వం విడుదల చేసింది.
మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.