KTR | హైదరాబాద్ : జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జీవో 46 బాధితులు గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మేము అధికారంలో ఉన్నప్పుడు జీవో 46 సవరిద్దామన్న ప్రయత్నం ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మీకు న్యాయం దక్కేవరకు బీఆర్ఎస్ పార్టీ తరపున తప్పకుండా పోరాడుతాం. మా నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి.. జీవో 46 బాధితుల తరపున పోరాడుతున్నాడని కేటీఆర్ తెలిపారు.
జీవో 46 బాధితుల కోసం పోరాటం చేస్తాం.
మేము అధికారంలో ఉన్నప్పుడు జీవో 46 సవరిద్దామన్న ప్రయత్నం ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మీకు న్యాయం దక్కేవరకు బీఆర్ఎస్ పార్టీ తరపున తప్పకుండా పోరాడుతాం.
– జీవో 46 బాధితులకు భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS… pic.twitter.com/CmS85H3BDN
— BRS Party (@BRSparty) June 20, 2024