Indiramma Illu | నర్సింహులపేట, మే 1 : ‘కటిక పేదరికంలో ఉన్నాం.. దండం పెడతాం..మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి’ అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నర్సింహపురం బంజరకు చెందిన బూడిగె లక్ష్మినారాయణ- ఉపేంద్ర దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ‘కొద్దిపాటి ఇంటిస్థలం తప్ప వ్యవసాయ భూములు, ఇతర ఆస్తిపాస్తులు లేవు. ఉన్న స్థలంలో ఇనుపరేకులు వేసుకొని భయం భయంగా కాలం వెల్లదీస్తున్నాం.
రోజూ కూలీ చేస్తే తప్ప కుటుంబం గడవదు.. మాలాంటి వారికి కాకుండా ఇంకెవ్వరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు? ఇండ్లన్నీ కాంగ్రెసోళ్లకే ఇస్తే మాలాంటి వారి పరిస్థితి ఏమిటి! ఒక్కసారి అధికారులు వచ్చి మా ఇల్లు చూడండి. దండం పెట్టి అడుగుతున్నాం.. మాకు ఇల్లు ఇవ్వండి’ అని వేడుకున్నారు.