హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా మిత్రధర్మం పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐకి బలమున్న చోట సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమా ర్గౌడ్తో సీపీఐ బృందం భేటీ అయ్యింది. ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మ హబూబ్‌నగర్, వరంగల్ ఉమ్మడి జిల్లా ల్లో బలమున్న స్థానాల్లో పోటీకి అవకా శం కల్పించాలని సీపీఐ బృందం పీసీసీ చీఫ్ ముందు ప్రతిపాదించినట్టు సమాచారం. బుధవారం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మరోసారి సమావేశం కా వాలని నిర్ణయించారు. కోర్టు రీ షెడ్యూ ల్ ప్రకటిస్తే టీజేఎస్, కాంగ్రెస్, సీపీఐతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి.. దాని ప్రకారం స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. చర్చల్లో సీపీఐ నుంచి పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన కేసులో తమను ప్రతివాదులుగా చేర్చాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని తమ పిటిషన్లో కోరారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తించే జీవో 9ని సవాల్ చేస్తూ, కొన్ని సమర్థిస్తూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం హైకోర్టులో విచారణ జరుగునున్నది.