హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు. పోలవరం, ఎగువ భద్ర ప్రాజెక్టు మాదిరిగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కోరినట్లు గుర్తు చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఆదేశించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 6న జరిగే భేటీలో ప్రాజెక్టులపై చర్చించేలా కమిటీని ఆదేశించాలని ప్రధానిని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Humble appeal to Hon’ble PM @narendramodi Ji
— KTR (@KTRTRS) December 3, 2021
Hon’ble Telangana CM KCR Ji had appealed to you several times to grant national project status to either #KaleshwaramProject Or #PalamuruLiftIrrigation project
While Polavaram in AP & Upper Bhadra in Karnataka are being recognised as pic.twitter.com/HZVoZnKyj4