హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర హాంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ అరాచకానికి బలైపోయిన బాలిక రక్షణను సీఎం రేవంత్‌రెడ్డి గాలికొదిలేశారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. ప్రధాని మోదీ పర్యటనపై ఉన్న శ్రద్ధ బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో లేదని మండిపడ్డారు. నిరసన తెలిపిన బీఆర్ఎస్వీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ చేసిందేమీలేదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ మండిపడ్డారు.