నర్సింహులపేట : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అర్ధరాత్రి నుంచే గ్యాస్ కోసం ఏజెన్సీ ఎదుట వినియోగదారులు క్యూలైన్లలో బారులు తీరి అక్కడే పడుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, ఎన్నో రోజులుగా బుకింగ్ చేసినప్పటికీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోరుతూ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ధర్నా చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో గ్యాస్ కొరత
నర్సింహులపేట మండలంలో అర్ధరాత్రి నుండే గ్యాస్ కోసం ఏజెన్సీ ఎదుట క్యూలైన్లలో బారులు తీరి అక్కడే పడుకున్న వినియోగదారులు
ఏజెన్సీ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, ఎన్నో రోజులుగా బుకింగ్ చేసినప్పటికీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో… pic.twitter.com/v3xZqBUpFz
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2026