హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా 21,992 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 26,027 పాఠశాలలు ఉన్నాయని, 54,201 మంది స్వయం సహాయక మహిళలు 18,16,081 మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారని తెలిపారు. 4,035 పాఠశాలలకు ఎల్పీజీ కనెక్షన్లు లభించాయని, మిగతా 21,992 పాఠశాలల్లో వంటచెరుకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఆయా పాఠశాలల్లో ఆగస్టు 15 నాటికి ఎల్పీజీ కనెక్షన్లను ఇప్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.