AK64 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత మార్క్ ఆంటోనీ ఫేం అధిక్ రవిచంద్రన్‌తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. ఏకే 64(AK64)గా రాబోతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి దర్శకుడు మారబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఏకే 64 డైరెక్ట్ మారనున్నాడు. ఈ మూవీకి కంగువ ఫేం సిరుతై శివ పేరును అజిత్ కుమార్ పరిశీలిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. కంగువ ఫెయిల్యూర్ తర్వాత ఏ స్టార్ యాక్టర్ కూడా శివ స్క్రిప్ట్‌ను వినేందుకు సిద్దంగా లేరట. ఇదే విషయాన్ని శివ అజిత్ కుమార్‌తో చెప్పాడు. ఈ నేపథ్యంలో అజిత్ కుమార్ ఈ సినిమాను శివతో చేయాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోపై రాబోయే రోజుల్లో ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇదే నిజమైతే మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శివకు అజిత్ కుమార్ సినిమా కలిసి రానుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సిరుతై శివ తెలుగులో గోపీచంద్‌తో శంఖం, శౌర్యం సినిమాలు తీయగా.. రవితేజ్‌తో దరువు తెరకెక్కించాడు. వీరమ్, వేదాళమ్, వివేగమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. మరి అజిత్ కుమార్‌ను సిరుతై శివ ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
As per Valaipechu,
Changes that #AK64 Director might get changed !!#Ajithkumar is considering Siruthai Siva for AK64The reason which Valaipechu says was Siva is very down due to the Kanguva Failure & no notable Hero is ready to listen to his script. Siva conveyed the same to… pic.twitter.com/C1UF6fIEj4
— AmuthaBharathi (@CinemaWithAB) March 18, 2026
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
Mallikarjun Kharge: మమ్ముల్ని ప్రేమించారు.. మోదీని పెళ్లి చేసుకున్నారు: మల్లిఖార్జున్ ఖర్గే
TS Assembly | యూరియా యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను వేధిస్తోంది : మాజీ మంత్రి వేముల