టేకులపల్లి, మార్చి 18 : టేకులపల్లి మండల కేంద్రంలోని మసీద్‌లో ముస్లింలకు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు లక్కినేని సురేందర్ రావు, టేకులపల్లి సర్పంచ్ బోడ బాలునాయక్ ఇచ్చిన ఇఫ్తారు విందులో బుధవారం ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య దళ్ సింగ్ నాయక్, మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వర ప్రసాద్, సర్పంచులు బోడ బాలునాయక్, లకవత్ నాకా నాయక్, లక్ష్మనాయక్, రామా నాయక్, టేకులపల్లి ఉప సర్పంచ్ అనంతుల వసంత, బీఆర్ఎస్ నాయకులు బానోతు రామా నాయక్, జాలాది అప్పారావు, భూక్యా లాలు నాయక్, ఆమెడ రేణుక, భూక్యా బాలాజీ, మౌలానా, నాగభూషణం, జాటోత్ నరేశ్, మూడు హుస్సేన్ పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్