గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 02:29:46

వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌లో తెలంగాణ టాప్‌

వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌లో తెలంగాణ టాప్‌

  • కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి గంగుల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌'లో దేశంలోనే తెలంగాణ  అగ్రస్థానంలో ఉన్నదని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టంచేశారు.శుక్రవారం కేంద్ర ఆహారశాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ అన్ని రాష్ర్టాల పౌరసరఫరాలశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తెలంగాణలో 96.40 శాతం లబ్ధిదారుల ఆధార్‌ కార్డులను రేషన్‌ కార్డులకు అనుసంధానం చేయడం పూర్తయిందన్నారు. తెలంగాణలో వలస కార్మికులకు కల్పించిన సదుపాయాలను మంత్రి గంగుల వివరించారు.


logo