స్ఫూర్తి పతాక

స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అంటే..
దేహం బుల్లెట్ల జల్లెడైనా వెరువక
శిఖరం మీదకి ఎగబాకి
తోటి జవాన్లకు దారి దీపమై
మార్గనిర్దేశనం చేసిన సుబేదారి
యోగేంద్రసింగ్ యాదవ్
తూట్లుపడ్డ గుండె నడుగు!
స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అంటే..
దేశం ముక్కలు కాకూడదంటూ
గాయపడ్డ కాలుని తానే నరికేసుకొని
యుద్ధంలో తిరిగి దూకిన
మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజ్
ధైర్యాన్ని అడుగు!
స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అంటే..
త్రివర్ణ పతాకాన్ని కార్గిల్‌పై ఎగరేసేందుకు వెళ్లి
విగత దేహానికి చుట్టుకొచ్చిన
విక్రమ్ బాత్రా భార్య కుంకుమ బొట్టునడుగు!
స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అంటే..
బంగ్లా విమోచనోద్యమంలో
కరాచీ రేవులోకి దూసుకెళ్లి
దడ పుట్టించిన భాబృభన్ యాదవ్ పొందిన
తొలి మహా వీరచక్ర పురస్కారాన్ని అడుగు!
స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అంటే..
తాజ్ హోటల్ ఉగ్ర తాండవంలో
సహోద్యోగుల్లో బాసట కోసం
చావుకు ఎదురెళ్లి కౌగిలించిన
హేమంత్ కర్కరే రక్తంతో రంగు మారిన కోటునడుగు
స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అంటే..
దేశ విభజనలో కుటుంబం తరలిపోయినా
ఆఖరి శ్వాస వరకూ పోరాడుతూ పోయిన
బిగ్రేడియర్ మహమ్మద్ ఉస్మాన్
అవివాహిత జీవితాన్ని అడుగు!
స్వాతంత్య్రం అంటే..
మనని మనం నియంత్రించుకోవటం మాత్రమే కాదు
ఉగ్రవాద దృష్టితో
సామ్రాజ్యవాద కాంక్షతో
చూసే చూపుని పాతరేయ్యటం
స్వేచ్ఛ.. మనజాతి నినాదమే కాదు
దేశ సమైక్య వేదం కూడా అని చాటిచెప్పటం!
మిత్రమా!
స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని
ఒక్క మాటలో నిర్వచించమని మళ్లీ అడుగుతున్నవా?
అయితే చెబుతా విను మనలో నిలబడ్డ దేశాన్ని
విశ్వశాంతి ఆకాశంలో
ఆత్మగౌరవ జెండాలా ఎగరెయ్యటం..!
సుధా శేఖర్ , మిల్వాకీ
+001 6306216815
ఇవి కూడా చదవండి :
కొన్నది వంకాయ.. కొసిరేది గుమ్మడికాయ
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

