కలల పడవ!
కలల పడవన అశ్రు జలధిని దాట గలిగిన చాలును! మృదుల గజలున హృదయ భారం మోయగలిగిన చాలును!

కలల పడవన అశ్రు జలధిని దాట గలిగిన చాలును!
మృదుల గజలున హృదయ భారం మోయగలిగిన చాలును!
ఎవరి కెవ్వరు తోడు నిలువని తిమిర వలయపు తోవన
మిణుగురగు చిరు ఆశ వెలుగున నడవ గలిగిన చాలును!
మీది పెద్దలు నేల వైపని ఎపుడు చూడని వేళన..
మీది మేఘం రైతుపై దయ కురువ గలిగిన చాలును!
చుట్టు లోకం అనుక్షణమూ కాలిముైల్లె సలుపగా..
నువ్వు పూలతో.. తనే దారిన నిలువ గలిగిన చాలును!
జీవితాంతం నటిస్తూనే కరిగిపోయే కాలము..
అసలు అశ్రువు ఒక్కటైనా.. ఒలక గలిగిన చాలును!
వక్రమార్గం చూపు విద్యలు ‘రాకుమార’ ఎందుకో..?
మనిషిలా ఓ నాల్గు నాళ్లూ.. బతుక గలిగిన చాలును!

మడిపల్లి రాజ్‌కుమార్,
9949699215
ఇవి కూడా చదవండి :
కొన్నది వంకాయ.. కొసిరేది గుమ్మడికాయ
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- farmer
- madipalli rajkumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

