హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): టీజీఎంఎస్ఐడీసీకి ప్రభుత్వం రూ.503 కోట్లు విడుదల చేసింది. పెండింగ్ బకాయిలు రూ.101 9 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. బుధవారం రూ.503 మంజూరు చేసింది. ఇటీవల నమస్తే తెలంగాణ పత్రిక ‘మందులకు పైసల్లేవ్!’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం వైద్యారోగ్యశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మందులకు రూ.364 కోట్లు, సర్జికల్స్‌కు రూ.26.25 కోట్లు, ఎక్విప్మెంట్కు రూ.66 కోట్లు, రీ ఏజెంట్స్‌కు రూ.44 కోట్లు, ఎన్విరాన్మెంట్ ఫండ్ కింద రూ.2.50 కోట్లు కలిపి మొత్తం రూ.503 కోట్లు విడుదల చేసింది.