భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు (Police) గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగిఉన్న ఇసుక లారీని పోలీసు పెట్రోలింగ్ జీపు ఢీకొట్టింది. దీంతో ఏఎస్సై హరిలాల్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. అయితే ఏఎస్సై పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు.