దండేపల్లి, డిసెంబర్ 4 : పంచాయతీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో బీఆర్ఎస్పై ఉన్న అభిమానంతో కుటుంబం మొత్తం ఎన్నికల బరిలోకి దిగింది. దండేపల్లి పంచాయతీని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు.
కుటుంబ పెద్ద అజ్మీర ప్రదీప్ సర్పంచ్ స్థానానికి పోటీలో ఉండగా, భార్య లలిత 4వ వార్డు, కుమారుడు దేవేందర్ 2వ వార్డు, కోడలు శారద 3వ వార్డు నుంచి పోటీచేస్తున్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఆశీర్వదిస్తే తమ కుటుంబమంతా ప్రజా సేవకే అంకితమవుతుందని వారు పేర్కొన్నారు.