మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందారు.
మరో ఘటనలో మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మరణించారు. దుండిగల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న యువకుడి తలకు తీవ్రంగా గాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. రెండు ఘటనలపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.