పద్మశాలీల సంక్షేమానికి 8500 కోట్లు
పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్‌లూం, హ్యాం డ్లూం కార్పొరేషన్లకు సబ్సిడీలు అంది స్తూ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్టీ భారం మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- నేతన్నకు అండగా కేసీఆర్ ప్రభుత్వం
- జీఎస్టీ భారం మోపిన మోదీ సర్కార్
- పద్మశాలీలకు కేంద్రం తీరని అన్యాయం
- కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవనం శంకుస్థాపనలో హరీశ్‌రావు
- అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రులు తలసాని, గంగుల, శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్‌లూం, హ్యాం డ్లూం కార్పొరేషన్లకు సబ్సిడీలు అంది స్తూ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్టీ భారం మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కోకాపేటలో రూ.150 కోట్ల విలువైన రెండున్నర ఎకరాల భూమిని పద్మశాలి భవనానికి కేటాయించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ భవనాన్ని అద్భుతంగా నిర్మించేందుకు నిధులు సరిపోకపోతే మరిన్ని మంజూరు చేస్తామని అభయమిచ్చారు. పవర్‌లూంకు విద్యుత్తు, హ్యాండ్లూంకు రసాయనాలపై సబ్సిడీతోపాటు అనేక అంశా ల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీలకు తోడు గా ఉన్నదని వివరించారు.
బతుకమ్మ చీరల కాంట్రాక్టును కూడా తెలంగాణ నేతన్నలకే ఇవ్వడంతో వారికి ఎంతో మేలు జరుగుతున్నదని చెప్పారు. హ్యాండ్లూం, హ్యాండీక్రాఫ్ట్ బోర్డును రద్దుచేసిన కేంద్రం నేతన్నకు తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చేనేతపై జీఎస్టీని విధించడం ద్వారా నేతన్నపై అంతులేని భారం మోపిందని ఆవేదన వ్యక్తంచేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా రాతపూర్వకంగా తెలియజేశామని, జీఎస్టీ కారణంగా నేతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పామని వెల్లడించారు. పద్మశాలి సామాజికవర్గంలో దేశం గర్వించే నేత కొండా లక్ష్మణ్‌బాపూజీ పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా ట్యాంక్‌బండ్‌పై కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని గర్తుచేశారు. లక్ష్మణ్ బాపూజీ బాటలోనే సీంఎ కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కేంద్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పోరాడారని గుర్తుచేశారు.
వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషి: మంత్రి గంగుల కమలాకర్
వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కేసీఆర్ సరార్ విశేష కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలోని 41 బీసీ కులాలకు రూ.వేల కోట్ల విలువైన 87.3 ఎకరాలు కేటాయించి, రూ.95 కోట్లతో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒకరూ అండగా నిలవాలని కోరారు.
కేసీఆర్ పాలనలో ఆత్మగౌరవం: తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తూ అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు కేటాయించడం ఎంతో సంతోషకరమని అన్నారు. కోట్ల విలువైన భూమిని కేటాయించడం కంటే ఆత్మగౌరవం మరోటి లేదని చెప్పారు. కేటీఆర్ మంత్రిగా ఉండి సమస్యలను పరిష్కరించడం పద్మశాలీల అదృష్టమని అన్నారు.
ఆత్మగౌర భవనాల ప్రదాత కేసీఆర్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పద్మశాలీ భవనానికి అత్యంత ఖరీదైన కోకాపేటలో భూమిని కేటాయించడం సీఎం కేసీఆర్ గొప్ప మనసుకు తార్కాణమని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కొండాలక్ష్మణ్, మహాత్మా జ్యోతిబాఫూలే లాంటి వారి ఆశయాలను కొనసాగించే కేసీఆర్ దొరకడం అదృష్టమని తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టే వారిని తరిమికొట్టాలని, బీసీలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
దేశానికి రైతన్న, నేతన్న రెండు కండ్లు: ఎంపీ రంజిత్‌రెడ్డి
గత ప్రభుత్వాలు పద్మశాలీలను ఓటు బ్యాంక్‌గా వాడుకున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నదని ఎంపీ జీ రంజిత్‌రెడ్డి తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న, బట్టలు నేసి ఆత్మాభిమానం కాపాడే నేతన్న దేశానికి రెండు కండ్లు అని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ సూల్ దశలో పద్మశాలి ఇంట్లోనే ఉండి చదువుకున్నారని, అయనకు వారి బాధలు తెలుసని చెప్పారు. నాడు ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్ జోలె పట్టుకుని విరాళాలు సేకరించి ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కార్పొరేషన్ల చైర్మన్లు చింతా ప్రభాకర్, గూడూరు ప్రవీణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మేయర్ గుండు సుధారాణి, బీఆర్ఎస్ నేత చాగండ్ల నరేంద్రనాథ్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, మచ్చ సుధాకర్, బొడ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఈహెచ్ఎస్ను పటిష్టంగా అమలు చేయాలి
- హరీశ్‌కు పీఆర్టీయూ విజ్ఞప్తి
అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల నూతన హెల్త్ స్కీంను (ఈహెచ్ఎస్) త్వరగా అమలు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ కోరింది. ఈ స్కీంకు పటిష్టమైన విధివిధానాలను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును పీఆర్టీయూ తెలంగాణ నేతలు కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య, ఎస్ భిక్షంగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మారెడ్డి అంజిరెడ్డి, గౌరవాధ్యక్షుడు పర్వతి సత్యనారాయణ, కోశాధికారి చంద్రశేఖర్‌రావు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?


