కారేపల్లి, అక్టోబర్ 3 : ఖమ్మం జిల్లా కారేపల్లి(సింగరేణి) మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఆదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కారేపల్లి మండల కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మా ట్లాడారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అనుచరులలో తాను ఒకరినని, అయినా తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో పార్టీలో ఇమడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలతో రాజీనామా చేశానని ప్రకటించారు. కేసీఆర్ హయాంలో కారేపల్లి మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి సర్పంచ్‌గా తనవంతు కృషి చేశానని పేర్కొన్నారు.