హైదరాబాద్,నవంబర్ 28 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచులపై కక్ష సాధింపులకు పాల్పడకుండా ఎన్నికల హామీ మేరకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతోనే సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళ్లమద్ది, నిర్మల్ జిల్లా పెంబి మాజీ సర్పంచ్‌లు ఏనుగుల కేశవరావు, పూర్ణచందర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాపాయస్థితిలో ఉన్నారని ఆరోపించారు.