చొప్పదండి, జనవరి 4: కాం గ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానని చెప్పి, ఇప్పుడు రూ.12 వేలే అనడం సరికాదని అన్నారు. రైతులను మోసం చేయడం ఒక్క రేవంత్‌రెడ్డికే సాధ్యమని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ విషయంలో మాట మార్చినట్టుగానే రైతు భరోసా విషయంలోనూ మాటమారుస్తున్నారని మండిపడ్డారు. ఎకరాకు 15వేలు ఇచ్చే వరకూ బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని, రైతులకు అండగా నిలుస్తామని స్పష్టంచేశారు.