హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Former MLA Rajaiah) ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి లేసినోడిలా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో సీఎం అజ్ఞానంపై సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిల్సుఖ్నగర్లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని అంటాడు.
హైదరాబాద్కు(Hyderabad) మూడు దిక్కుల సముద్రం ఉందని అంటున్నాడు.. తెలంగాణలో పాలన పిచ్చోడు చేతిలో రాయిలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనపై పట్టులేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయని, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందుల పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress govt) ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి లేసినొడిలా మాట్లాడుతున్నాడు.
దిల్సుఖ్నగర్లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని అంటాడు.
హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రం ఉందని అంటున్నాడు.. తెలంగాణలో పాలన పిచ్చోడు చేతిలో రాయిల ఉంది – మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య pic.twitter.com/61cBaSk0Aw
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2024