మునగాల, మార్చి 5: ఎండుతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతుంటే ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని, సాగునీరు ఇవ్వకుండా రైతుల ఉసురు తీస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగు నీరు అందక సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిన వరి పంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వగా, కాంగ్రెస్ పాలనలో నీళ్లు రాక బతుకులు ఆగమవుతున్నాయన్నారు. సాగుకు నీళ్లియ్యకపోతే రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.