చెన్నూర్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్, క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.
బుధవారం ఆయన చెన్నూర్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల కండువాలు ధరించి బీఆర్ఎస్ శ్రేణులతో కలసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామి బైక్‌లపై పోలింగ్ బూత్‌లవద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపించారు. చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ కారులో వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు, మద్యం బాటిళ్లు పంపిణీ చేశారని ఆరోపించారు.