హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగా ణ ఉన్నన్నినాళ్లు కేసీఆర్ ఉంటారని, కొండంత కేసీఆర్‌ను రవ్వంత రేవంత్‌రెడ్డి ఏమీ చేయలేడని అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఏదో చేస్తానని అనుకోవడం సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వం అని ఎద్దేవా చేశా రు. కేసీఆర్ అంటే తెలంగాణ సర్వనామం అని, ప్రతి గుండెలో కేసీఆర్ ఉంటారని స్పష్టం చేశారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1గా తీర్చిదిద్దిన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అవాకులు చెవాకులు పేలటం దుర్మార్గమని మండిపడ్డారు.
తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్ : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ప్రజల గుండెచప్పుడు కేసీఆర్ అనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు తాగే మిషన్ భగీరథ నీళ్లలో… గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చని చెట్లలో.. కాళేశ్వరం జల సవ్వడిలో, కాకతీయ చెరువు మత్తడిలో, విద్యుత్తు వెలుగుల్లో, గురుకుల బడుల్లో, యాదాద్రి గుడిలో, జిల్లాకో వైద్య కళాశాల విప్లవంలో.. ఇలా అడుగడుగునా కేసీఆర్ ఉన్నారనే స్పృహతో రేవంత్‌రెడ్డి వ్యవహరించాలని హితువు పలికారు.
పొంగులేటి.. చరిత్ర తెలుసుకో: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
మంత్రి పొంగులే టి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. అధికా రం ఎవరికీ శాశ్వతం కాదని, తామూ అధికారంలోకి వస్తామనే విషయాన్ని పొంగులేటి విస్మరించారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయటం రేవంత్‌రెడ్డి అండ్ కో తరం కాదన్నారు.
సీఎం రేవంత్ ఆత్మపరిశీలన చేసుకోవాలి : బీఆర్ఎస్వీ నేత తుంగబాలు
రేవంత్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు సూచించారు. ఏడాది లో కేసీఆర్ పేరు ఉండదు అంటుంటే అసలు నువ్వు ఉంటావా? అని ప్రశ్నించారు. చరిత్రలో అన్నదమ్ముల విభేదాలతోనే యుద్ధాలు వచ్చాయని.. మీ అన్నదమ్ముల నుంచే ప్రాణహానీ ఉందేమో కనుకోఅని రేవంత్‌కు హితవుపలికారు.