హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ): ‘కేసీఆర్ వ్యక్తి కాదు.. అసమాన పోరాటంతో రాష్ట్రాన్ని సాధించిన మహాశక్తి. గజ్వేల్ దాడి ఆయన క్యాంపు కార్యాలయంపైనే దాడి కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై జరిగిన దాడి’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ అరాచకాలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గద్దెనెక్కిన కాంగ్రెస్ రెండున్నరేండ్లలో సాధించిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్.. కేసీఆర్, బీఆర్ఎస్ ఇతర ముఖ్య నేతలపై కక్ష సాధించడమే పనిగా పెట్టుకొన్నదని దుయ్యబట్టారు.