హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) బీసీ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. గురువారం అసెంబ్లీలో ( Assembly ) పద్దు అంశంపై మాట్లాడారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్( Reservations ) ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్లలో 45 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రాజ్యసభకు ఇద్దరు బీసీ బిడ్డలను పంపిందని అన్నారు.గురుకుల స్కూల్స్, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటు బీఆర్ఎస్ ఘనతేనని స్పష్టం చేశారు.ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు ధర్నా చేస్తే అగ్రనాయకత్వం ఎందుకు హాజరు కాలేదని ఆరోపించారు.
ప్రజలను మోసం చేయడానికే అమలుకు సాధ్యం కాని హామీలిచ్చారా అంటూ నిలదీశారు. 42 శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే, బీసీ సబ్‌ప్లాన్ మీ చేతుల్లోనే ఉంది.బడ్జెట్లో రూ. 20 వేల కోట్ల కేటాయింపు మీ పరిధిలోనే ఉంది కదా ? ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మెల్యే తలసాని ప్రశ్నించారు.అంబేద్కర్ కల్పించిన హక్కుల కోసం పోరాడతామని అన్నారు. రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా జరపలేదపి. బీసీ కమిషన్ రిపోర్ట్ నేటి వరకు పబ్లిక్ డొమెన్లో ఎందుకు పెట్టలేదని అన్నారు.
ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేటాయింపులు, ఖర్చులకు పొంతనలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్యకు ఒకొక్కరికి 20 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించామని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఅంబర్స్ మెంట్ ఇంకా చెల్లించలేదని విమర్శించారు. ఎంతో చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా యాదవ్‌ను కేసీఆర్ నియమించారని తెలిపారు. బీసీ ప్రయివేట్ బిల్లును కాంగ్రెస్ పార్లమెంట్లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు.