హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో ధర్నా చేస్తే బీసీలకు రిజర్వేషన్లు రావని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రిని కలవకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ధర్నాలు స్టంట్ మాత్రమేనని, ఇలాంటి వాటిని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ది ఉంటే 42% రిజర్వేషన్లు సాధించే వరకు ఢిల్లీలోనే ఉండాలని సూచించారు. గతంలో రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ బిల్లు పాస్ అయ్యే వరకు తిరిగి రాలేదని, అదే తరహాలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోనే ఉండాలని స్పష్టం చేశారు.