జనగామ, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత భూస్థాపితం అవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అ న్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు వి ద్యుత్తు సరఫరా చేస్తుంటే, 5 గంటలు సరిపోతుందంటున్న పార్టీకి ఎవరైనా ఓటేస్తారా? అని ప్రశ్నించారు. శనివారం జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో 5 గంటల కరెంటు అని మూర్ఖంగా మాట్లాడి వెళ్లారని, కాంగ్రెస్ నాయకులు ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని ప్రశ్నించారు.
దొంగ సర్వేలు చేయించుకొని బీసీలు, ముస్లిం మైనార్టీలను దక్కాల్సిన సీట్లను రూ.కోట్ల్లకు అమ్ముకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో నామరూపాల్లేకుం డా పోతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్లో బీసీలకు అడుగడుగునా అవమానాలే తప్ప, ఆ వర్గాలకు ఏ మాత్రం గౌరవం, గుర్తింపు లేదని చెప్పారు. అణగారిన వర్గాల ఓట్ల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇన్నేళ్లుగా లేని కులగణన అంశాన్ని లేవనెత్తుతున్నాయని దుయ్యబట్టారు.
అధికారంలోకి వచ్చిన కేవ లం 3 నెలల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేయించిన ఘనుడు దేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. అందుకే తెలంగాణకు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తాను పదవులు, అధికారం కోసం బీఆర్ఎస్లోకి రాలేదని.. గౌరవం ఉండాలని, బీసీలను గౌరవించే పార్టీల్లో ఉండాలనే చేరినట్టు స్పష్టంచేశారు. 55 ఏండ్ల కాంగ్రెస్ చరిత్రలో తెలంగాణ నుంచి ఆ పార్టీకి ఏనాడూ 50 సీట్లు రాలేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొన్నారు.