హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress government) మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టారు. దిల్సుఖ్నగర్లో విమానాలు అమ్ముతున్నారు అనేది ఎంత నిజమో.. తెలంగాణలో భాక్రానంగల్ డ్యాం ఉంది అనేది ఎంత నిజమో..తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ(Loan waiver) కూడా అంతే నిజమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉండగా 60 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం మాత్రం 44 లక్షల మంది అని లెక్కలు చెప్పి 22 లక్షల మంది రైతులకు మాత్రమేరుణమాఫీ ఎందుకు చేసిందని ప్రశ్నించారు. అసలుకంటే కొసరు ఎక్కువ అన్నట్లు రుణమాఫీపై మీడియా ప్రకటనలకే రూ.300 కోట్లు వరకు ఖర్చు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రూ.29 వేల కోట్లు రుణమాఫీ, రూ.72 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతులకు డబ్బులు అందజేసి అండగా నిలిచామని ఆయన గుర్తు చేశారు.