హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ రాజ్యం అంటే ఆంక్షలు విధించటమా? క ర్ఫ్యూ వాతావరణం సృష్టించడమా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో దేశానికే మకుటాయమానంగా తీర్చిదిద్దిన పోలీస్ వ్యవస్థను కేవలం 10 నెలల్లోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని పేర్కొన్నారు.
దేశ చరిత్రలో పోలీసులు నిరసనకు దిగడం ఇ దే తొలిసారి అని, ఇది కాంగ్రెస్ సర్కా రు మార్క్‌ను గుర్తుచేసిందని విమర్శించారు. తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తుచేసినందుకు పోలీసులను సస్పెండ్, డిస్మిస్ చేయడం దారుణమని పేర్కొన్నారు. కేటీఆర్ బా వమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌పై పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. రేవంత్ కుట్రలో పోలీసులు పావులుగా మా రుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.