హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): యూరియా సరఫరాలో రాష్ట్ర సర్కార్ దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇవ్వడం చేతగాకే యాప్‌లు, కార్డుల పేరిట నాటకాలాడుతున్నదని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రెండు బస్తాల యూరియా కోసం రైతులు ఆధార్‌కార్డులు, పాస్‌బుక్‌లు సమర్పించడం ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పారు. రైతులు తెల్లవారుజామున నుంచి చలిలో వణుకుతూ పడిగాపులుకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు.