హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ) : ఆదిలాబాద్ ప్రజలకు ఆయువుపట్టు లాంటి సీసీఐని తిరిగి ప్రారంభించకుండా ఆ సంస్థ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమవడం మోదీ ప్రభుత్వ కుటిలత్వానికి పరాకాష్ట అని, సీసీఐని తుక్కుకింద అమ్మే నిర్ణయాన్ని కేంద్రం వెనకి తీసుకునే వరకు కార్మికులతో కలిసి ఉద్యమిస్తమిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తుకుకింద తెగనమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని మండిపడ్డారు. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్‌స్టోన్ నిల్వలతో సకల వనరులు కలిగిన సంస్థను అంగడి సరుకుగా మార్చిన పాపం మోదీ ప్రభుత్వానిదేనని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. సీసీఐకి చెందిన ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెకకట్టి ఆన్లైన్లో అమ్మేందుకు టెండర్లు పిలవడం బీజీపీ ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. నిర్మాణ రంగంలో సిమెంట్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సీసీఐని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని పదుల సార్లు కేంద్ర మంత్రులను తమ ప్రభుత్వం కోరినా, కనీసం వారు కనికరించకపోవటం ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని ఫైర్ అయ్యారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీసీఐని తిరిగి ప్రారంభించేందుకు బీఆర్ఎస్ ప్రభు త్వం నిరంతరం కృషిచేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. సీసీఐని తిరిగి ప్రారంభిస్తే ఆదిలాబాద్‌లోని వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతో ప్రధాని మోదీతో పలుమార్లు ఈ విషయంపై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారని తెలిపారు. తాను స్వయంగా కేంద్ర మంత్రులైన నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండే, పీయూష్ గోయల్‌ను పలుమార్లు కలవడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశానని గుర్తుచేశారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం లేదా జాయింట్ వెంచర్ రూపంలో సీసీఐ యూనిట్‌ను తిరిగి తెరిచే విషయాన్ని పరిశీలిస్తామని 2016లో అప్పటి కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మంత్రి అనంత్ గీతే ప్రకటించారని చెప్పారు. కానీ, కేంద్రమంత్రి మాటలు నీటి మీది రాతలుగానే మిగిలాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సిర్పూర్ పేపర్ మిల్లును తమ ప్రభుత్వమే తిరిగి ప్రారంభించిందని, కేంద్రం తలుచుకుంటే సీసీఐ కూడా పునఃప్రారంభమయ్యేదని వివరించారు. సీసీఐని పునరుద్ధరించాలని ఆదిలాబాద్‌లో వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసిన పోరాటంలో బీఆర్ఎస్ నాయకులు ముందుండి కొట్లాడుతున్నారని పేర్కొన్నారు.
సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ ఇప్పుడు ఆ సంస్థను స్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమే. బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం. సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు, వారి ఆర్తనాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా?
2018 ఎన్నికల ప్రచారంలో సీసీఐని తెరుస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పుడా సంస్థను స్రాప్గా అమ్మేందుకు ఆన్లైన్ టెండర్లు పిలవడం ఆదిలాబాద్ ప్రజలకు చేసిన మోసమేనని కేసీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ వచ్చిన ప్రతి సందర్భంలో బీజేపీ నాయకులు సీసీఐని తెరిపిస్తామని ఇచ్చిన హామీలను ఇప్పుడు మర్చిపోయారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా నుంచి మొదలుకొని హంసరాజ్ గంగారం వరకు ప్రతి ఒకరూ ఎన్నికల్లో లబ్ధి కోసం సీసీఐని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అప్పనంగా అమ్మేస్తున్నారని మండిపడ్డారు.