పెద్దపల్లి, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ 11 నెలల పాలనలో ప్రజలకు ఏం ఒరగబెట్టారని ఈ నెల 14 నుంచి ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలి. 420 హామీల అమలేది? వాటిల్లో ఒక్కటైనా అమలు చేశారా? అసలు ఏ ము ఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళతారు’ అని మా జీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సంబురాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా వంచన దినాలను నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో గెలిచిందని, 11 నెలల పాలనలో చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పదేండ్లలో బీఆర్ఎస్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ 11 నెలల్లోనే నాశనం చేసిందని విమర్శించారు.
హైదరాబాద్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యుత్తుశాఖ మంత్రుల సమావేశానికి డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యా రు. భట్టితోపాటు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పాల్గొన్నారు. రాష్ర్టానికి సంబంధించిన విద్యుత్తు అంశాలపై కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌తో భట్టి చర్చించారు.