హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించారని, ప్రత్యేక రాష్ట్రమే రాకపోతే రేవంత్రెడ్డి సీఎం అయ్యేవారా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వరంగల్ సభలో ఆసాంతం కేసీఆర్ను తిట్టడానికే కేటాయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసలు ఆ సభ ఏ ఉద్దేశంతో నిర్వహించారో ప్రజలకు అర్థం కాలేదని, అభివృద్ధిని అడ్డుకుంటే జైలుకు పంపిస్తామన్న రేవంత్రెడ్డి తెలంగాణలో అభివృద్ధి ఎకడ జరిగిందో ప్రజలు చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనుల భూములను లాకొని నిర్మించాలనుకున్న ఫార్మాసిటీ ఎవరి కోసమో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక మొక కాదు మహావృక్షమని పేర్కొన్నారు. 11 నెల పాలనలో రేవంత్రెడ్డి నోట బూతులు తప్ప నీతులు రాలేదని ఎద్దేవా చేశారు. ఏం సాధించారని సంబరాలు జరుపుకొంటున్నారని ప్రశ్నించారు.