హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కోతలు పెట్టేందుకే ప్రభు త్వం మళ్లీ రైతుభరోసా దరఖాస్తులు స్వీకరిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కేసీఆర్ సర్కారు హయాంలో తీసుకున్న వివరాలు ఉండగా మళ్లీ దరఖాస్తులు ఎం దుకని శనివారం ఒక ప్రకటనలో ప్ర శ్నించారు.
అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామ ని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. గ్రామసభల్లో రైతు భ రోసా వివరాలు సేకరించిన ప్రభుత్వం, తిరిగి దరఖాస్తు చేసుకోవాలనడం హా స్యాస్పదమని విమర్శించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఎన్నికల హామీల అమలులో తాత్సా రం చేస్తున్నదని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.