అదిలాబాద్ : ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్ష పాత్ర(Opposition role)ను ప్రజలతో మమేకమై ధైర్యంగా నిర్వహిస్తామని. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) అన్నారు. బుధవారం ఆయన అదిలాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానంలో వెన్నుదండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటూ వారి రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.
అదేవిధంగా స్థానికంగా గెలిచిన అభ్యర్థికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టకుండా తాను స్వతహాగా తెచ్చినటువంటి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టి తన అవునత్యాన్ని చాటుకోవాలన్నారు. లేదంటే వారి అసమర్థ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో చేయ నటువంటి సంక్షేమాలు కేసీఆర్ చేసి చూపించారన్నారు. కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చిల్లర రాజకీయాకులకు తావివ్వలేదని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజా తీర్పుని పూర్తిగా మేము గౌరవిస్తున్నాం. ఇకముందు వారితోనే కలిసి నడుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెయిర్ రంజాని, పట్టణ అధ్యక్షుడు అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, పాల్గొన్నారు.