హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, ఆశా వరర్ల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడంలేదని మాజీమంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి సమస్యలను చాయ్ తాగినంత సేపట్లో పరిషరిస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ హామీ ఇచ్చారని, 365 రోజులు దాటినా చాయ్ తాగినంత సమయం దొరకలేదా? అని ప్రశ్నించారు.
గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో మూసేసిన సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌కు రైల్వేలైన్ వేయిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుదిశగా ప్రయత్నిస్తలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ నేతలమంతా కలిసినట్టు చెప్పారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్న ఉదంతాలను కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ అంశాలు లేవనెత్తాలని, కోరినట్టు చెప్పారు. సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్‌నాయక్, నాయకులు రామకిషన్రెడ్డి, శ్యాంసుందర్, కిరణ్‌కుమార్, చారులత, సుధాకర్, శ్రీరామ్, తిరుమల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.