హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీ(Loan waiver) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటి దొంగలా దొరికిందని ఆరోపించారు. మంగళ వారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆ పార్టీ విధానాలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..17 లక్షల 13 వేల మందికి రుణ మాఫీ చేయలేదని స్వయంగా మంత్రి ఉత్తమ్ ఒప్పుకున్నారు. రూ.31 వేల కోట్లు పూర్తిగా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇది ఏ తేదీలోపు చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలన్నారు. సీఎం రుణ మాఫీ పూర్తయిందని డ్యాన్సులు చేస్తు న్నారు. మంత్రులు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం చెప్పింది అబద్ధమని ఉత్తమ్ మాట లతో అర్దమవుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముక్కు నేలకు రాసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? చెంపలు వేసుకుంటావా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ఇంకా మేము పని మొదలు పెట్టలేదు. ముందు ముందు మా తడఖా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.
రైతులు ఆందోళన చేస్తే భయపెట్టిస్తారు. పోలీస్ స్టేషన్లో పెడతారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ మాత్రం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న మా డిమాండ్ పై సీఎం రేవంత్ తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ సోయి, ఆత్మ లేని వ్యక్తులు సచివాలయంలో ఉండటం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మేము అధికారం లోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు. రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్లో లేదంటే రేవంత్ తన ఇంట్లోనో పెట్టుకోవాలని సూచించారు.
సీఎం పదవిలో ఉండి తెలంగాణ తల్లిపై చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ నోటి నుంచి ఒక్కసారైనా తెలంగాణ పదం ఉచ్ఛరించారా? ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణకు ఏమి ఇచ్చారని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివా లయం ముందు పెట్టాలని ప్రొఫెసర్ హరగోపాల్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కోదండ రామ్ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు పైళ్లా శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి, ఒంటెద్దు నరసింహా రెడ్డి ఉన్నారు.