హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ నీటి హక్కులను పొరు గు రాష్టాలకు తాకట్టు పెట్టొద్దని, తుంగభద్రపై కర్ణాటక నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డి ప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు బుధవారం లేఖ రాశారు. సమైక్యపాలనలో రాష్ర్టానికి జరిగిన అనేక అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటని, వాటిని నివారించేందుకే ఉద్యమాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను మళ్లించి పాలమూరు వంటి వలస జిల్లాల ను పచ్చని పంటలతో కళకళలాడేలా చేసిందని గుర్తుచేశారు.
జల హకుల పరిరక్షణ పట్టని కాంగ్రెస్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన జల హకులను పరిరక్షించాల్సిన బా ధ్యతను విస్మరించి హరీశ్‌రావు ఆరోపించారు. నదుల అనుసంధానం పేరుతో గో దావరి జలాలను తమ రాష్ర్టాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని, ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ద్రోహబుద్ధితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కొడంగల్ లిఫ్ట్‌కు ఎన్వోసీ మతలబేంది?
కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎన్వోసీ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏందో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చే శారు. చివరి దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తే గ్రావిటీ ద్వారా నారాయణపేట, కొడంగల్‌కు నీళ్లు వచ్చే అవకాశముఉన్నా ఎందుకు పకనబెట్టారని రేవంత్‌ను ప్రశ్నించారు. కమీషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. తుంగభద్ర నుంచి శ్రీశైలానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రం గా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు.
కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు..
కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలని హరీశ్ కో రారు. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తూ.చ తప్పకుండా పా టించాలని సూచించారు. అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేయాలని, కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హకులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు హకుగా రావాల్సిన ప్రతినీటి చుకనూ కాపాడటం ప్రభుత్వ చట్టబద్ధ, రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని గుర్తుచేశారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్ర యోజనాలను తాకట్టు పెట్టే ప్రతి నిర్ణయాన్నీ బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు. పాలమూరు రైతాంగం భవిష్యత్తు కోసం, తెలంగాణ జల హకులను కాపాడటం కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం చేస్తుందని, ఎంతదూరమైనా వెళ్లి కొట్లాడుతుందని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల అనుమతులు లేకుండా తుంగభద్రపై కర్ణాటక ఇష్టారీతిన ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు?. కర్ణాటక తనకు కేటాయించిన పరిమితులను దాటి అదనపు సాగు చేస్తున్నది. వెంటనే ఆ ప్రాజెక్టులను అడ్డుకొని సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు అభ్యంతరాలు తెలుపాలి. లేకపోతే ఆర్డీఎస్తో పాటు తుమ్మిళ్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది.
– హరీశ్‌రావు