హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసు లు లాఠీచార్జి చేయడం అమానుషమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గ్రూప్-1 అభ్యర్థులు ఏమైనా టెర్రరిస్టులా? బందిపో ట్లా? అని శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించా రు. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనే త రాహుల్‌గాంధీ సమాధానం చె ప్పాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులపై దాడికి దిగి పోలీసులే హిం సను ప్రేరేపించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. శాంతియుతం గా నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం కాంగ్రెస్ దమననీతికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటన లో విమర్శించారు. గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై ప్రభుత్వం ఎందుకు తొందర పడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. అశోక్‌నగర్ ప్రాంతం ఏమైనా టెర్రరిస్ట్ హబ్బా? లేక అదేమైనా శ త్రుదేశమా? అని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.