హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): విగ్రహాలను మార్చడం మీద ఉన్న ధ్యాస సీఎం రేవంత్‌రెడ్డికి విద్యార్థుల మీద ఎందుకు లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంతో పాటు సొంత జిల్లాలోని గురుకులాలు, పాఠశాలలను పట్టించుకోని నిర్లక్ష్యపు ము ఖ్యమంత్రి అని మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లతో విద్యార్థులు దవాఖానల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని నిలదీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో 15 మంది వి ద్యార్థులు దవాఖాన పాలైన దుస్థితి నెలకొన్నదని, సీఎం సొంత జిల్లాలోనే ఇలా ఉంటే రాష్ట్ర వ్యా ప్తంగా ఇంకెన్ని దారుణ పరిస్థితులు ఉన్నా యో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభు త్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని ఎద్దే వా చేశారు. మాటలే తప్ప చేతలు లేని సీ ఎం తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు దవాఖాన పాలు కావాలి?, ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? అని ప్రశ్నించారు.