హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఉద్యమకారులం, కేసీఆర్ తయారుచేసిన సైనికులం.. రేవంత్‌రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడబోమని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘బిడ్డా.. నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా విడిచి పెట్టేది లేదు. ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నవు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. మేం తప్పు చేయలేదు. ధైర్యంగా వెళ్తున్నం. అడిగిన వాటికి బాజాప్తా సమాధానం చెప్తం’ అని తేల్చిచెప్పారు. మంగళవారం ఉదయం సిట్ విచారణకు బయల్దేరే ముందు తన నివాసం వద్ద, తెలంగాణభవన్ వద్ద హరీశ్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ బావమరిది బాగోతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రం నోటీసు ఇచ్చారని, చట్టాన్ని గౌరవించి రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి సిట్ విచారణకు వెళ్తున్నట్టు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయటపడితే నష్టం జరుగుతుందనే రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని విమర్శించారు.
మున్సిపోల్స్‌లో ప్రజలే నీకు బుద్ధి చెప్తరు
‘వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నీకు ప్రజలే దిమ్మతిరిగే జవాబు చెప్తరు’ అని హరీశ్ హెచ్చరించారు. ‘మున్నిపల్ ఎన్నికలున్నాయని బతుకమ్మ చీరలు పంచుతరట! పట్టణాల్లో వడ్డీ లేని రుణాలిస్తరట! మాకు నోటీసులిచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేస్తున్నరు. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి అంచనాలు తప్పినయ్. 40% సీట్లలో మేం విజయం సాధించినం. మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలని కేసులు, విచారణ అం టున్నరు’ అని మండిపడ్డారు. ఎన్ని డైవర్షన్లు చేసినా బొగ్గు, పవర్, హిల్ట్ పీ సామ్‌లు బయటపెడుతామని, ఆంధ్రాకు అమ్ముడుపోయిన దానిపై నిలదీస్తూనే ఉం టామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకు అయ్యింది నిజం కాకుంటే బొగ్గు సామ్‌పై సీబీఐ విచారణ వేయాలని డి మాండ్ చేశారు. నైనీ బ్లాక్ ఒకటే కాదు, అన్ని టెండర్లు రద్దు చేయాలని, సీబీఐ విచారణ జరపాలని, దొంగలను అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును కకించాలని డిమాండ్ చేశారు. సింగరేణి డబ్బుతో రేవంత్ ఫుట్‌బాల్ ఆడితే,. షోకుల కోసం ఖర్చు చేస్తుంటే కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు.