సూర్యాపేట (నమస్తే తెలంగాణ)/చందంపేట(దేవరకొండ), సెప్టెంబర్ 15 : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రానికి పట్టిన పీడ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సాగర్ ఆయకట్టు పరిధి రైతులందారూ వరిసాగు చేయాలని, కాంగ్రెస్ ప్రభు త్వం మెడలు వంచి నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉండగా నాగార్జున సాగర్‌లో నీళ్లు సరిపడా ఉన్నప్పటికీ ఎడమ కాల్వ రైతులకు నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతుంటే కేసీఆర్ పాదయాత్ర చేపట్టడంతో దిగివచ్చి నీళ్లు ఇచ్చారని, అదే మాదిరి నేడు చంద్రబాబు శిష్యుడైన రేవంత్ మెడలు వంచేందుకు కేటీఆర్ పాదయాత్ర చేస్తారని చెప్పారు.
రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ దయ్యాలు పోవాలని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఇంటిలో నియోజకవర్గ బీఆర్ఎస్ గిరిజన నాయకుల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17న ప్ర తి తండాలో కేసీఆర్ ఫ్లెక్సీతో ర్యాలీలు నిర్వహించి క్షీరాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు.