హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ నాయకులపై త్వరలోనే దళితులతో దాడు లు చేయిస్తామని మండలి విప్ బల్మూరి వెంకట్ బెదిరింపులకు దిగారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం పెట్టి బీఆర్ఎస్ నేతలు వైఖరి మార్పుకోకుండా మాట్లాడితే దళితులు దాడి చేయడం తప్పదని బెదిరించారు.
గతంలో మాకు పక్కటెముకలకే దెబ్బలు తగిలాయి.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా ఉండదం టూ వెంకట్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు సహజంగా జరుగుతున్నవి కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.